Friday, April 19, 2024
Friday, April 19, 2024

రథోత్సవాన్ని లాగిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి దంపతులు

విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని శివానగర్లో శనివారం పురాతమైన శ్రీ బచ్చు నాగంపల్లి కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో నూతన రథోత్సవము శనివారం అంగరంగ వైభవంగా జరిగింది.కమిటీ సభ్యులు, దాతలు, భక్తాదులు నడుమ అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. శివపార్వతులను ప్రత్యేకంగా అలంకరించి నూతన రథముపై ఆశీస్సులు చేశారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవమును ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. పూజల అనంతరం మడుగు తేరును లాగుతూ మధ్యాహ్నం వరకు ఆలయం వద్దనే నూతన రథాన్ని ఉంచి భక్తాదుల దర్శనం కోసం ఏర్పాటు చేశారు. స్థానికంగా కాకుండా, వేలాదిమంది భక్తాదులు వివిధ మండలాల నుంచి జిల్లాల నుండి తరలివచ్చి పూజలు చేపట్టారు. తదుపరి మధ్యాహ్నం రథోత్సవాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి దంపతులు లాగి ప్రారంభించారు. ఈ రథోత్సవ లో మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల, వైస్ చైర్మన్లు పెనుజూరు నాగరాజు, భాగ్యలక్ష్మి, ఆలయ కమిటీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు భక్తాదులు రతాన్ని లాగుతూ ముందుకు ముందుకు కదిలించారు. కడువైభవంగా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి రథోత్సవం జరిగింది. మొట్టమొదటిసారి ఈ రథోత్సవం జరగడం పట్ల పట్టణ ప్రజలు, ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేసి, తమ భక్తిని చాటుకున్నారు. రథం లాగుటలో హరినామ స్మరణ మారుమోగింది. వన్ టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి భక్తాదులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలను పోలీసులు అందించారు. ఆలయ కమిటీ వారు కూడా వాలంటీర్లను ఏర్పాటు చేసి, శివుని దర్శించడానికి క్యూ లైన్ లో అందరిని వరుసగా పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గోపీనాథ్, కమిటీ సభ్యులు గోవిందరాజులు, గుర్రం రాజేంద్ర, కౌన్సిలర్ జయరామిరెడ్డి తో పాటు, కో ఆప్షన్ సభ్యులు, మాజీ కౌన్సిలర్ ఉడుముల రామచంద్ర, నాయకులు కేశవరెడ్డి, భాస్కర్ రెడ్డి, పట్టణ వార్డు కౌన్సిలర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు భక్తాదులు, వేలాదిమంది భక్తాదులు, ప్రజలు స్వామివారి ను దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img