వర్ధంతి సందర్భంగా ఘనంగా వైయస్సార్ విగ్రహావిష్కరణ
విశాలాంధ్ర -తనకల్లు : మహానేత ఆశయాలను కొనసాగించడమే ఆయనకు ఘనమైన నివాలని కదిరి శాసనసభ్యులు పీవీ సిద్ధారెడ్డి తెలిపారు మండల కేంద్రంలోని సచివాలయ ఆవరణలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకొని చేపడుతున్న విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు సిద్ధారెడ్డి తో పాటు మాజీ శాసనసభ్యులు కడపల మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు డాక్టర్ బత్తల వెంకటరమణలు హాజరయ్యారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి సహచరుడు కడపల మోహన్ రెడ్డి విగ్రహావిష్కరణ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెచప్పుడు అని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు ఇప్పటికీ ప్రజలు మరువరని వాటిని కొనసాగిస్తూ మరిన్ని సంక్షేమాలను ప్రజలకు చేరువ చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయునిగా రూపుదిద్దుకున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ ఎద్దుల మధుసూదన్ రెడ్డి మేజర్ పంచాయతీ సర్పంచ్ సరస్వతి మహిళా కన్వీనర్ విజయమ్మ బూత్ కమిటీ కన్వీనర్ హేమ శేఖర్ రెడ్డి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రామ్ దేశాయ్ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు