Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

మారిషస్ ప్రభుత్వం అందించే పురస్కారానికి ఎమ్మెల్సీ ఎంపిక పట్ల హర్షం

విశాలాంధ్ర-ఉరవకొండ : విద్యా రంగానికి చేసిన సేవలకు మరియు వేలాది మంది విద్యార్థులకు బంగారు బాట వేసిన సాయిబాబా విద్యాసంస్థల చైర్మన్ మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయిన ఎంవి రామచంద్రారెడ్డి మారి షస్ ప్రభుత్వం అందించే పురస్కారానికి ఎంపిక కావడం పట్ల ఉరవకొండ ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ అధ్యక్షులు మరియు వాణి విద్యా నికేతన్ కరస్పాండెంట్ రఘు రాములు హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మారిషస్ ప్రభుత్వం విద్యాశాఖ సహకారంతో ఇంటలిజెన్స్ మైండ్ ట్రస్ట్ 2023 సంవత్సరానికి ఎక్స్ లెన్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అవార్డుకు ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. ఆగస్టు 23వ తేదీన మారిషస్ సెక్రటరీయేట్లో ఆ దేశ అధ్యక్షులు పృథ్వీరాజ్ సింగ్ రూపాన్ చేతులు మీదుగా పురస్కార్ అవార్డును ఎమ్మెల్సీ అందుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలను అవార్డులను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img