Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు మోడీ

కర్ణాటక ఫలితాలే దేశవ్యాప్తంగా పునరావృతం

మతోన్మాద బిజెపిని ఓడించేందుకు ప్రజలు సంసిద్ధం.

జగన్ పాలనలో రాష్ట్రం తిరో గమనం.

కనిపించని అభివృద్ధి — . అడ్రస్ లేని సాగునీటి ప్రాజెక్టులు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

మార్కాపురం : వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి కాస్తా హడావుడి చేయాలని ప్రయత్నిస్తున్నారని, అయితే ఎన్నికలు ఏ క్షణం వచ్చిన దేశ ప్రజలు ఓడించి, బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. రాష్ట్రాన్ని రక్షించండి– దేశాన్ని కాపాడండి అనే నినాదంతో సిపిఐ ఆధ్వర్యంలో బయలుదేరిన బస్సు జాత సోమవారం సాయంత్రానికి మార్కాపురం చేరుకుంది.
ఈ సంధర్బంగా మంగళవారం ఉదయం స్థానిక పూల శాంతిభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లాభాలతో నడుస్తున్న ఎల్ఐసి , పౌర విమానాయనశాఖ, హిందుస్థాన్ పెట్రోల్ కెమికల్స్, గంగవరం, కృష్ణపట్నం పోర్టు, బిఎస్ఎన్ఎల్, రైల్వే శాఖ తదితర లక్షల కోట్ల రూపాయల విలువచేసే వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం నష్టల బాట చూపుతూ మరోవైపు అంబానీ ఆదానీ లకు కారు చౌకాగా విక్రయిస్తుందని అయన తీవ్రంగా విమర్శించారు.
ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 142 కోట్ల మంది ప్రజలకు తాను ప్రతినిధిని అనే విషయం మరచిపోయిన ప్రధాని మోడీ తన స్థాయిని దిగదార్చి మతం పేరుతో నిస్సిగ్గుగా ఓట్లు అడిగారని, అయితే ఆ రాష్ట్ర ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కూడా కర్ణాటకలో వచ్చిన ఫలితాలే దేశవ్యాప్తంగా పునరావృతం కానున్నాయని ఆయన భరోసా వ్యక్తం చేశారు. మోడీ 9 ఏళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యవసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగిపోయాయని, దీని ఫలితంగా రవాణా రంగం పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోయిందని అన్నారు. దీంతో ఈ రంగాలను నమ్ముకుని జీవిస్తున్న కోట్లాదిమంది కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

మోడీ పాలనకు వ్యతిరేకంగా దేశంలోని దాదాపు 25 రాజకీయ పార్టీలకు పైగా పాట్నా, బెంగళూరు నగరాలలో ఎప్పుడైతే సమావేశాలు జరిగాయో అప్పటినుండి మోడీకి వణుకు బయలుదేరిందని, అందులో భాగంగానే వెంటనే ఢిల్లీలో ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు.
మణిపూర్ రాష్ట్రంలో జరిగిన అల్లర్లు వల్ల మన దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా దిగజారిందని, దీనికి కారణం మోడీ ఉన్మాద చర్యలే కారణమని తీవ్రంగా విమర్శించారు.

ఏపీలో జగన్ పాలన గాడి తప్పిందని, అభివృద్ధి అనే పదం కనుచూపుమేరలో ఎక్కడ కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్రం వ్యవసాయ రంగం మీద ఆధారపడిన విషయాన్ని ముఖ్యమంత్రి మర్చిపోయారని విమర్శించారు. అందుకు ఉదాహరణే ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోవడమేనని గుర్తు చేశారు. రెండు లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ ఉండగా అందులో 10% కూడా సాగునీటి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి ఖర్చు పెట్టడం లేదని, ఇలా అయితే ఈ ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులను సాగునీటి ప్రాజెక్టులకు గత నాలుగు సంవత్సరాలుగా వ్యయం చేసి వుంటే ఈపాటికి కొన్ని ప్రాజెక్టు లైనా పూర్తి అయి వినియోగంలోకి వచ్చేవని అన్నారు. రాష్ట్రంలో కృష్ణ, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి తదితర జీవనదులు ఎన్నో ఉన్నాయని, వీటి నుండి సముద్రంలోకి వృధాగా నీరు పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ ప్రకాశానికి వరప్రసాదమైన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు నేటికీ పూర్తి కాకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని అన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రజల జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోగా మరోవైపు రాష్ట్రానికి ఏ ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని అన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందకుండా రాష్ట్రం ఎలా ముందుకు వెళుతుందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారానే పబ్బం గడుపుకుంటు, మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు వుందని అయన విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి అందే నాసరయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి శ్రీనివాస్, జిల్లా ఏఐటియుసి కార్యదర్శి ఎస్ కె కాశీం లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img