Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

మదర్ తెరసాను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి

శ్రీ సత్య కృపా మహిళా డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డోలా పెద్దిరెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : మదర్ తెరిసాను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని శ్రీ సత్య కృపా మహిళా డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డోలా పెద్దిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కళాశాలలో మదర్ తెరిసా జయంతి వేడుకలను విద్యార్థులు అధ్యాపకులు నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. అందరూ కూడా మదర్ తెరిసా చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఎదుట మనిషిని ప్రేమించి, నిస్వార్థంగా సేవ చేయడం ఎంత గొప్ప విషయమో, ప్రపంచానికి చాటిన సెయింట్ మదర్ తెరిసా గారి జయంతి ను జరుపుకోవడం అంతే సంతోషమని తెలిపారు. ఈ జయంతి సందర్భంగా ఆ కరుణామూర్తి సేవలను ఎంతో గొప్ప అని విద్యార్థులకు వారు వివరించారు. “ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న” అన్న ఆమె మాటలు విద్యార్థులకు మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మల్లికార్జున, అధ్యాపక, బోధనేతర బృందము, విద్యార్థులు పాల్గొన్నారు.-

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img