Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మాతృభాష అమృతం లాంటిది

ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

విశాలాంధ్ర-గుంతకల్లు : ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలని ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు త్రిష్లా బన్సాలి అన్నారు. తిమ్మాపురం గ్రామంలో జడ్పీహెచ్ పాఠశాలలో ఆరవ తరగతి ఏడవ తరగతి విద్యార్థులకు ఇన్నర్ విల్ క్లబ్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించి 60 మంది విద్యార్థులకు వాటర్ బాటిల్స్ సర్టిఫికెట్లు అధ్యక్షురాలు త్రిష్లా బన్సాలి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష అని తల్లి ఒడే బిడ్డకు తొలిబడి అన్నారు. అమ్మ మాటే మాతృభాషని ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలని తెలిపారు.జీవితంలో పైకి ఎదగాలంటే ఇతర భాషలను నేర్చుకోక తప్పదు కానీ వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలన్నారు. మన మాతృభాషను రక్షించుకోవాలని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మోహన్, ఇన్నర్ విల్ క్లబ్ సభ్యులు శాంతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img