Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

పారిశుద్ధ్య కార్మికురాలు మృతికి సంతాపం

మున్సిపల్ అధికారులు, యూనియన్ నాయకులు
విశాలాంధ్ర – ధర్మవరం:: పురపాలక సంఘ కార్యాలయంలో నాలుగవ డివిజన్లో విధులు నిర్వహిస్తున్న మారుతమ్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలు సోమవారం రాత్రి ఆకస్మి కంగా మృతి చెందింది. సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, సానిటరీ ఇన్స్పెక్టర్లు మేస్త్రీలు ఆమె మృతికి సంతాపం తెలిపారు. అనంతరం శానిటరీ ఇన్స్పెక్టర్లు మహబూబ్ బాషా, సాంసన్ కేశవ లు మాట్లాడుతూ మృతి చెందిన మారుతమ్మ ఇంకను మూడు సంవత్సరాలు సర్వీస్ ఉందని, వారు ఆకస్మికంగా మృతి చెందడం బాధాకర మన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ తో పాటు మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, వైస్ చైర్మన్లు శంషాద్ బేగం, వేముల జయరాం రెడ్డి, కౌన్సిలర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు నాగరాజు, ఆంజనేయులు, నరసింహులు, పార్థసారథి, యూనియన్ నాయకులు సంతాపం తెలుపుతూ నివాళులు అర్పించారు. కమిషనర్ మాట్లాడుతూ చట్టపరంగా మృతి చెందిన మారు తమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా తెప్పించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img