Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎమ్మెల్యే సార్ కాస్త పాఠశాల పరిస్థితి పట్టించుకోండి…!

నీటిమయంతో మారినా పట్టించుకోని విధ్యా అధికారులు
ప్రభుత్వ పాలనలో విద్యార్థుల అవస్థలు

విశాలాంధ్ర-గుంతకల్లు : పాఠశాలలో నీరు చేరుకుంటే చాలు ఆవరణం అంత మురికి వాడల దర్శనమిస్తోంది. ఎక్కడ చూసినా ఇదే తంతు ఏర్పడడంతో విద్యార్థులకు రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ఏఐఎస్ ఎఫ్ నియోజవర్గం ఆర్గనైజింగ్ కార్యదర్శి వినోద్ అన్నారు. పట్టణంలో ఇందిరాగాంధీ పాఠశాలలో అధ్వానంగా మారిన నీటిమయం చూసి ఆశ్చర్యపోయామని అన్నారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పడమే గానీ విధ్యా స్కూల్లు ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు కనిపించడం లేదని విమర్శించారు. నీరు నిలిచిపోయి పాఠశాల అధ్వానంగా ఉందని అన్నారు. పట్టణంలో అయినప్పటికీ ఇక్కడ అభివృద్ధి మాత్రం జరగడం లేదని ఆరోపణలు చేశారు.నీటి మయంగా ఏర్పడడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.అది ఎస్ కెపి కళాశాల ముందు పాఠశాలలో బారీగా నీరు చేరడంతో నీరు చెరువును తలపిస్తోందన్నారు. సమస్యలు చెప్పే అధికారులు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం విడ్డూరం అన్నారు. ఉన్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.పాఠశాల నాడు నేడు అబివృద్ది చేశమని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img