విశాలాంధ్ర – ఉరవకొండ : జాతీయ మానవ హక్కుల రాష్ట్ర కార్యదర్శిగా ఉరవకొండ పట్టణానికి చెందిన నాగమల్లి ఓబులేసు నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ నాయుడు ఓబులేష్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఓబులేసు మంగళవారం ఉరవకొండలో విలేకరులతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం మానవులకు కల్పించిన స్వేచ్ఛ హక్కులను ఎవరు భంగం కలిగించకుండా చూసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. మానవ హక్కులు ఉల్లంఘించే చర్యలు ఎవరు చేపట్టినా కూడా వారిలో చైతన్యం కలిగించి హక్కులను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు అంతేకాకుండా విద్య, పర్యావరణ, ఆరోగ్యం, క్రీడలు, యోగా లాంటి వాటిపై కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని అలాగే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాములు ద్వారా మానవ హక్కుల పై విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. తనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన అధ్యక్షులు భాస్కర్ నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.