Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దూదేకులకు వరాల జల్లు కురిపించిన నారా లోకేష్

విశాలాంధ్ర-తాడిపత్రి: పెద్దపప్పూరు మండలంలోని సింగనగుట్టపల్లి నుండి మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. పెద్ద పప్పూరు సమీపంలో నూర్ భాషా దూదేకుల సేవా సంఘం నారా లోకేష్ తో ముఖా ముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దూదేకుల సేవా సంఘం నాయకులు, కులస్తులు దూదేకుల కులానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా రుణాలు ఇప్పించాలన్నారు. దూదేకుల కులాన్ని గుర్తించి రాజకీయంగా ఎదగడానికి చట్టసభలలో తమకు స్థానం కల్పించాల న్నారు. విదేశాల్లో తమ పిల్లలు చదువు కోవడానికి ఆర్థికంగా ఆదుకోవాలని తదితర సమస్యలపై ఆయనకు విన్నవించు కున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా గుర్తించని విధంగా ముస్లింలను గుర్తించిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ఏదేమైనప్పటికీ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దామాసి ప్రకారం అన్ని కులాలతోపాటు దూదేకులను కూడా గుర్తించి తమ సమస్యలు తీర్చుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి దూదేకుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img