Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

విశాలాంధ్ర – బొమ్మనహల్ మండలంలోని కొత్తూరు కానాపురం ఏ లంజి గ్రామంలో
జాతీయ నులిపురుగులు నిర్మూలన దినోత్సవం సందర్భంగా డాక్టర్ గీత భార్గవి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మంగళవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న(1 to 19 సం) పిల్లలందరికీ , అలబెండ జోల్ మాత్ర లు తినిపించడం జరిగింది. పాదరక్షలు లేకుండా భహిరంగ మలవిసర్జనకు వెళ్ళినప్పుడు ,శుభ్రం చేయని కూరగాయలు తిన్నప్పుడు, వ్యక్తిగతంగా చేతులు శుభ్రం చేయకుండా ఆహారం తిన్నప్పుడు నులిపురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ నులిపురుగులు కడుపులో ప్రెగులకు అంటుకొని రక్తంలోని హీమోగ్లోబిన్ పదార్థాన్ని తినడం వల్ల రక్తహీనత జబ్బు వస్తుందని ,పలితంగా వ్యక్తి నీరసించి అనేఖ వ్యాధులు దరి చేరతాయనీ తెలియజేయడం జరిగింది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, శానిటరీ లెట్రిన్స్ వాడాలని పోస్తికాహారం తినాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త వెంకట రమణ, ఉపాధ్యాయులు చంద్రశేఖర్,ఉమ,గిరిజమ్మ, ఆశ లు నాగమణి,గిరిజ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img