విశాలాంధ్ర, కదిరి : పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంఫై జాతీయ జెండాను నియోజకవర్గ కార్యదర్శి ఇసాక్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సముపార్జనలో త్యాగం చేసిన అమరులను గుర్తు చేసుకుంటూ, ఎందరో త్యాగధనుల పోరాటాల ఫలితమే ఆగస్టు 15 నేటి మన స్వాతంత్ర్య పండగన్నారు.దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన శ్రమించిన మహాత్ములందరినీ స్మరించుకుంటూ త్యాగధనుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజక వర్గ సహాయ కార్యదర్శులు ఇమ్రాన్, రాజేష్ పట్టణ కార్యదర్శి లియకత్, పట్టణ సహాయ కార్యదర్శి మనోహర్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు మీసాల నరసింహులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ, కదిరి మండల కార్యదర్శి పాల రమణ, నాయకులు శంకర్,రమేష్, మల్లి,గంగరాజు,రెడ్డి,
తదితరులు పాల్గొన్నారు