Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

అర్హులైన చేనేత కార్మికులుకు నేతన్న నేస్తం వర్తింపజేయాలి

ఏపీ చేనేత కార్మిక సంఘం ధర్మవరం తాలూకా కార్యదర్శి వెంకటనారాయణ
విశాలాంధ్ర – ధర్మవరం : అర్హులైన చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం వర్తింపచేయాలని ఏపీ చేనేత కార్మిక సంఘం ధర్మవరం తాలూకా కార్యదర్శి వెంకటనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం మాట్లాడుతూ చేనేత రంగంలో కులాలకు అతీతంగా, అన్ని కులాల వారు చేనేత పరిశ్రమంలో నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. గత నాలుగు దఫాలుగా నేతన్న నేస్తం కార్పొరేషన్ ద్వారా విడుదల చేయకుండా డైరెక్ట్ గా నేత కార్మికుల అకౌంట్లో జమ చేయడం జరిగింది కానీ,ఐదో విడత మాత్రం కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయడం ఏంటి? అని వారు ప్రశ్నించారు. గత నెల 21వ తేదీన నేతను నేస్తం విడుదల చేశారే కానీ ఈ నిధులు కార్పొరేషన్ ద్వారా జమ చేస్తున్నారు అయితే బీసీలకు మాత్రం నేస్తన్న నేస్తం పడింది, ఓసీలకు మాత్రం 15 రోజులు గడుస్తున్నా నేతన నేస్తం ఇప్పటికీ పడలేకపోవడానికి కారణాలేంటో ప్రభుత్వం చెప్పాలని తెలిపారు. కుల మతాలకతీతంగా చేనేత కార్మికులు కు అర్హత గల వారికి ఇప్పటికైనా వెంటనే నేతన్ననేస్తమును విడుదల చేయాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img