Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

నేతన్న నేస్తం కార్మికులకు ఒక వరం

ఒకటవ వార్డు కౌన్సిలర్ చెలిమి రామకృష్ణమ్మ
విశాలాంధ్ర – ధర్మవరం : నేతన్న నేస్తం కార్మికులకు ఒక వరమని ఒకటో వార్డు కౌన్సిలర్ చెలిమి రామకృష్ణమ్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదవ విడత నేతనులకు నేతన్న నేస్తం పథకం సందర్భంగా 24 వేల రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ చేయడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నిలబట్టి నిలబెట్టుకున్న ఏకైక రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. తదుపరి వార్డు చేనేత కార్మికులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కౌన్సిలర్ రామకృష్ణమును సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్టోర్ డీలర్ భైమూతక రమణా తో పాటు ఆ వార్డు చేనేత కార్మికుల లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img