Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

కార్మికుల పక్షపాతి ఎన్నారై కిరణ్ కుమార్

విశాలాంధ్ర-తాడిపత్రి: కార్మికులు కష్టాల్లో ఉన్నాడని తెలిసిన వెంటనే ఎన్నారై కిరణ్ కుమార్ తన వంతు సహాయం అందిస్తూ కార్మికుల పక్షపాతిగా నిలుస్తున్నాడని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులు పేర్కొన్నారు. శనివారము పట్టణంలోని అంబా భవాని దేవాలయంలో ఎన్నారై కిరణ్ కుమార్ 38వ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నారై కిరణ్ కుమార్ మాట్లాడుతూ తాను పేద కుటుంబంలో పుట్టి, పేదరికం అనుభవిస్తూ, అష్ట కష్టాలు పడి, విద్యను అభ్యసించిన గురువుల, తల్లిదండ్రుల సూచనల మేరకు ఇంతటి గొప్పవాడినైనానని చెప్పారు. కావున ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి గొప్పవారై తన తోటి వారు ఎవరైనా కష్టాల్లో ఉన్నట్లు తెలిసిన వెంటనే తన వంతు సహాయంగా సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరికి సూచిస్తూ పాటించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్వకుళ సాలే కుల సంఘం అధ్యక్షులు ఆనంద్,
రంగనాథ రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు కుల్లయప్పా,
కార్పెంటర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నబి రసూల్, రవి, ఎలక్ట్రిషన్ అండ్ ప్లంబర్ అసోసియేషన్ గౌరవధ్యక్షులు బాబా అధ్యక్షులు కోనేటి రవి, కోమలి సీన, ప్రసాద్, నరేష్, కృష్ణ, ఆది ఎన్నారై కిరణ్ కుమార్ చిన్ననాటి స్నేహితులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img