Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

స్వచ్ఛభారత్ నిర్వహించిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎస్కే యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ శాఖ ఆదేశాల మేరకు గో ట్లురు గ్రామంలో డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్. విద్యార్థులు ప్రత్యేక క్యాంపును మంగళవారం నిర్వహించారు. ఈ ప్రత్యేక క్యాంపు కోఆర్డినేటర్ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని ప్రధాన రోడ్లు, ప్రభుత్వ పాఠశాల, సచివాలయం, వైయస్సార్ రైతు భరోసా, దేవాలయ ప్రాంగణంలోని పరిసరాలను శుభ్రం చేసి, ప్లాస్టిక్ తో పాటు ఇతర వ్యర్థ పదార్థాలను శుభ్రం చేయడం జరిగిందన్నారు. ఎన్ఎస్ఎస్ క్యాంపు సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కిరణ్ కుమార్, రామ్మోహన్ రెడ్డి, ఆనందు, ఎన్ఎస్ఎస్ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img