Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

న్యూరో సర్జరీ ఆధ్వర్యంలోమెదడు గాయాలపై అవగాహన ర్యాలీ

హెల్మెట్, సీట్ బెల్ట్, ట్రాఫిక్ రూల్స్ ను తప్పక పాటించాలి

సూపర్ స్పెషాలిటీ న్యూరో సర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ జి భాస్కర్
విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ జి భాస్కర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ రవితేజ, డాక్టర్ భాస్కర్ బాబు ఆధ్వర్యంలో జిల్లా పోలీసు శాఖ, ట్రాఫిక్ పోలీస్ శాఖ, ఆర్టీవో శాఖ, మెడికల్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్, డి డి ఫార్మా , ఇంటాస్ ఫార్మ సంయుక్త ఆధ్వర్యంలో అనంతనగరంలో మెదడు గాయాల పై అవగాహన నెల సందర్భంగా మెదడుకు కలిగే గాయాల నివారణ పై సమాజంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్లకార్డులతో, స్లోగన్లతో, పోస్టర్లతో, కరపత్రాలతో అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుంచి తెలుగు తల్లి విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, సప్తగిరి సర్కిల్ నుంచి తిరిగి సాయి నగర్ మీదుగా ప్రభుత్వ వైద్య కళాశాల వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ కే ఎల్ సుబ్రహ్మణ్యం, న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ జి భాస్కర్ సంయుక్తంగా జండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ ర్యాలీలో మరియు ఆ తరువాత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి న్యూరో సర్జరీ సమావేశ మందిరంలో జరిగిన అవగాహన సదస్సు లో అనంతపురం అడిషనల్ ఎస్ పి హనుమంతు, ఆర్టీవో ఆఫీసర్ సురేష్ నాయుడు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ జి.రఘునందన్, ఆర్ ఎం ఓ డాక్టర్ వైవి రావు, కార్డియాలజీ విభాగాధిపతి సహచార్య డాక్టర్ సుభాష్ చంద్రబోస్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మనోరంజన్ రెడ్డి, బయో కెమిస్ట్రీ సహాచార్యులు డాక్టర్ బి ఆర్ శ్యాం ప్రసాద్, ఎస్ పి ఎం సహాచార్యులు డాక్టర్ తెలుగు మధుసూదన్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ సౌజన్య కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, బయో మెడికల్ ఇంజనీర్ సురేష్, 2కె 17 బ్యాచ్ హౌస్ సర్జన్లు, 2కె 20,2కె 22 బ్యాచ్ మెడికల్ విద్యార్థులు, న్యూరో సర్జరీ విభాగ అధ్యాపకేతర సిబ్బంది, డిడి ఫార్మ కంపెనీ అధినేతలు పాల్గొన్నారు.
మెదడు గాయాలపై అవగాహన కల్పిస్తూ తయారుచేసిన టీ షర్టులను ధరించి మెడికోలు అనంతనగరంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అడిషనల్ ఎస్పీ హనుమంతు మాట్లాడుతూ మన మెదడులో కలిగే ఆలోచనలను నియంత్రించుకుని అతివేగంగా డ్రైవింగ్ చేయకుండా, హెల్మెట్, సీటు బెల్టు, ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఉంటే రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతామని తెలిపారు. న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల కంటే మన భారతదేశంలో అతి వేగం కారణంగా, రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా ఎక్కువమంది యాక్సిడెంట్లకు గురై మెదడు గాయాలకు గురి అవుతున్నారని, అందుకే రోడ్డు భద్రతా ప్రమాణాలను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. మనకోసం మన కుటుంబం ఇంటిదగ్గర ఎదురుచూస్తూ ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని, మెదడులో ఏ ప్రాంతం దెబ్బతిన్న అది తిరిగి రూపు దాల్చిన సందర్భం జరగదని అందుకే ప్రమాదాలను నివారించడం లో అవగాహనను ప్రజలకు కల్పించడం ద్వారా మరణాలను తగ్గించవచ్చు అన్నారు. సూపర్ స్పెషాలిటీ సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ కే ఎల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి న్యూరో సర్జరీ విభాగంలో ఉన్న సౌకర్యాలను ప్రజలు ఉపయోగించుకుని ప్రాణాలు కాపాడుకోవాలని తెలిపారు.
సూపర్ స్పెషాలిటీ న్యూరో సర్జరీ విభాగ సెమినార్ హాల్లో నిర్వహించిన సదస్సులో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవితేజ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాలను, మెదడుకు కలిగే గాయాలను నియంత్రించుకోవడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆసుపత్రిలోని సిబ్బందికి అవగాహన కల్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img