Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

రెండు చోట్ల ఓటు నమోదు పై రాజకీయ పార్టీల అభ్యంతరాలు

విశాలాంధ్ర- ఉరవకొండ : ఒక వ్యక్తికి ఒకటి లేదా రెండు మూడు చోట్ల ఓటర్ లిస్టులలో ఓటు నమోదై ఉందని అలాంటీ వాటిని పరిశీలించి ఒక వ్యక్తికి ఒకే చోట ఓటర్ నమోదు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వివిధ రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను అభ్యంతరాలను వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు తదితర అనేక అంశాలపై రాజకీయ పార్టీల సలహాలు సూచనలు తీసుకోవడానికి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఎన్నికల ఓటర్ల నమోదు పరిశీలకులు శంకరయ్య, నియోజకవర్గంలోని ఐదు మండలాల తాసిల్దారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ ఉరవకొండ పట్టణంలో ఒక వ్యక్తి పేరు మూడు నాలుగు బూతులలో నమోదై ఉందని అంతేకాకుండా కొంతమంది వ్యక్తులు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రంలో కూడా ఓటు హక్కును నమోదు చేసుకొని రెండు రాష్ట్రాల్లో కూడా ఓట్లు వేస్తున్నారని అంతేకాకుండా ఉద్యోగరీత్యా ఇతర కారణాలవల్ల స్థానికంగా లేనివారి ఓట్లు కూడా రెండు మూడు చోట్ల నమోదై ఉన్నాయని వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి ఒక వ్యక్తి ఓటు ఒకే చోట ఉండే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అనేక మంది చనిపోయిన వ్యక్తుల పేర్లు కూడా ఇప్పటికీ ఓటర్ల లిస్టులో నమోదై ఉన్నాయని వాటిని కూడా తొలగించాలన్నారు. తప్పనిసరిగా ఓటర్ నమోదుకు ఆధార్ అనుసంధానం చేయాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. దీనిపై ఓటర్ల నమోదు పరిశీలకులు శంకరయ్య మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకుల యొక్క అభ్యంతరాలు సూచనలను జిల్లా ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఓటర్ లిస్టు నమోదు పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img