Friday, April 19, 2024
Friday, April 19, 2024

పవర్ లూమ్స్ మగ్గాలపై దాడులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు

ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మి క సంఘం
నేటి నుండి చేనేత చైతన్య యాత్రలు ప్రారంభం

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని పవర్ లోన్స్ మగ్గాలపై దాడులు చేయడంలో హ్యాండ్లూమ్స్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలో స్థానిక కదిరి గేట్ బ్రహ్మంగారి గుడి ఫంక్షన్ హాల్ లో చేనేతల సమావేశంను సాయంత్రం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, చేనేత కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్ష,కార్యదర్శులు వెంకట నారాయణ, వెంకటస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి రవి హాజరయ్యారు. ఈ సమావేశం అధ్యక్షులు వెంకటనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 24వ తేదీ బుధవారం నుండి చేనేత చైతన్య యాత్రలు  జరుగుతాయని, ప్రతి చేనేత కార్మికున్ని ఉద్యమ భాగస్వామిని చేయడమే లక్ష్యంగా జరిగే లా ఈ పర్యటనలు వుంటాయని తెలిపారు. పట్టణంలోని 40 వార్డులలో వార్డుల వారీగా చేనేత పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేసి, ఆ కమిటీల ద్వారా మరమగాల వైలేషన్ పై ప్రత్యక్ష పోరాటానికి సిద్ద మౌతామని తెలిపారు. ధర్మవరం లోని ప్రధాన రాజకీయ పార్టీలు చేనేత కార్మికుల ఉపాదీ సంక్షేమం కంటే, ఎన్నికలలో పెట్టుబడి పెట్టె సంపన్న వర్గం వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనపడుతున్నదని ఆవేదన వ్యక్తం చేసారు. చేనేత కార్మికులు తమ ఉపాధిని కాపాడుకోవడానికి ఉద్యమం తప్ప, మరో మార్గం కనపడడం లేదని అన్నారు. రెసిడెన్షియల్ ఏరియాలలో మర మగ్గాల ఏర్పాటుపై  పోలిస్టేషనలలో చేనేతలు ఫిర్యాదులు ఇవ్వాలని, అదేవిదంగా ఫీవర్ టు ఫీవర్ నేసే మగ్గాల సమాచారాన్ని కూడా ఎన్ ఫోర్స్ మెంట్ అధికార్లకు  సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత నాయకులు వూట్ల ప్రసాద్, మంజునాథ్, శ్రీధర్, చెన్న భుజంగం, గోవర్దన్, గంగాధర, సురేష్, రామాంజనేయులు, చెన్న బుజంగం, శ్రీధర్, మద్దిలేటి తో పాటు అధిక సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img