Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

15న అగ్రిగోల్డ్ బాధితులు చలో విజయవాడ పోస్టర్లను విడుదల చేసిన బాధితుల సంఘం నాయకులు

విశాలాంధ్ర- ఉరవకొండ : అగ్రిగోల్డ్‌ బాధితుల న్యాయ పోరాటానికి ఈ నెల 15 విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వస్తున్నట్లు అగ్రి గోల్డ్ కస్టమర్స్ మరియు ఏజెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్దేశ్వర పిలుపునిచ్చారు. అగ్రి గోల్డ్ బాధితుల శంఖారావ దీక్షకు సంబంధించిన పోస్టర్లను బుధవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 32 లక్షల మంది కష్టార్జితాన్ని అగ్రిగోల్డ్‌ గజ దొంగలు దోచుకున్నారన్నారు. వీరి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి నేడు మడమ తిప్పారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు
ఈనెల 15న విజయవాడలో జరుగే భారీ బహిరంగ సభకు బాధితులందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ ఉరవకొండ మండల కార్యదర్శి తలారి మల్లికార్జున, ఉరవకొండ మండల ఏజెంట్ల అసోసియేషన్ అధ్యక్షులు తిమ్మరాజు, బాధితులు మల్లేష్,రంగస్వామి, చలపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img