Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ఈనెల 20వ తేదీన అనంతపురంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం

అనంతపురం అర్బన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

: జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఈనెల 20వ తేదీన అనంతపురంలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి తెలిపారు. ప్రతి వారంలో బుధవారం, శుక్రవారం మండల స్థాయి జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా అనంతపురం అర్బన్ ప్రజల కోసం ఈనెల 20వ తేదీన బుధవారం అనంతపురం నగరంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
అనంతపురం నగరంలోని కృష్ణ కళామందిర్ లో బుధవారం ఉదయం 9:30 గంటల నుంచి జగనన్నకు చెబుదాం, స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొంటారన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని అనంతపురం అర్బన్ (మున్సిపాలిటీ) ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img