మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం వెనుక భాగాన జోన్-2 పంపింగ్ ప్రధాన పైప్ లైన్ పగిలిపోవడం వలన నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నదని, శుక్రవారం మరమ్మత్తు చేసిన తర్వాత శనివారం రోజు నీటి సరఫరా ఉంటుందని మున్సిపల్ కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో బండి శేషన్న తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శుక్రవారం పట్టణంలోని కొత్తపేట లక్ష్మీ నగర్ బాలాజీ నగర్ దుర్గా నగర్ సుందరయ్య నగర్ ఏరియాలకు శుక్రవారం కాకుండా, శనివారం రోజున నీటి సరఫరా చేయబడునని తెలిపారు. కావున ప్రజలు గమనించి సహకరించాలని వారు తెలిపారు.