విశాలాంధ్ర -ఉరవకొండ : పాలీసెట్ కౌన్సిలింగ్ లో సర్టిఫికెట్లు పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈనెల 12 నుంచి 24వ తేదీ వరకు ఓరియెంటేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉరవకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ అశ్రాఫ్ ఆలీ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 12 రోజులపాటు జరిగే ఓరియంటేషన్ తరగతులలో విద్యార్థులకు కోర్సుల పట్ల అవగాహన, ఉద్యోగ అవకాశాలు, ఆంగ్ల భాష పై ప్రావీణ్యం, సాఫ్ట్వేర్, ఆరోగ్యం, స్కాలర్షిప్లు, హాస్టల్ వసతి, సీనియర్ విద్యార్థుల యొక్క అనుభవాలు క్రమశిక్షణ తదితర అనేక అంశాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కౌన్సిలింగ్లో సర్టిఫికెట్లు పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు అందరూ కూడా తరగతులకు హాజరు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల త్రిబుల్ ఈ శాఖధిపతి సురేష్ బాబు, కళాశాల సిబ్బంది ఆలీ హసన్ హుస్సేన్, సులోచన పాల్గొన్నారు