ఆర్డిటి క్రికెట్ కోచ్ రాజశేఖర్
విశాలాంధ్ర- ధర్మవరం : గ్రామీణ ప్రాంతాలలో క్రీడల యొక్క ప్రతిభను వెలికి తీయడమే మా లక్ష్యము అని ఆర్డిటి క్రికెట్ కోచ్ రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుట్ట కింద పల్లి లోని ఆర్ డి టి స్టేడియంలో ఆర్డిటి నిర్వహిస్తున్న ఐపీఎల్ 2023 క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ క్రికెట్ కోచ్ రాజశేఖర్ మాట్లాడుతూ ఈ పోటీలలో భాగంగా బత్తలపల్లి- ధర్మవరం జెట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ధర్మవరం ఘనవిజయం సాధించిందని తెలిపారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బత్తలపల్లి మధు నాయక్ (3 వికెట్లు) నరసింహ (రెండు వికెట్లు) తీయడంతో జట్టు 94 పరుగులు చేసి, ఆల్ అవుట్ అయ్యిందని తెలిపారు. 95 పరుగుల లక్ష్యాన్ని ధర్మవరం 11.4 ఓవర్లను ఛేదించి సునాయాసంగా విజయాన్ని అందుకుందని తెలిపారు. ధర్మవరం జట్టు ఆటగాడు నరసింహ 38 పరుగులతో అజయ్యంగా నిలిచాడని ఇటువంటి గవర్నమెంట్ నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎంతో మంచి అవకాశం వచ్చిందని తెలిపారు. తదుపరి విజేతలకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. తాము క్రీడలలో ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా క్రికెట్ కోచింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామీణ, పట్టణ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.