మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : భరతమాత ముద్దుబిడ్డ భారతరత్న శ్రీ డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మెడికే కళాశాలలో ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి పుష్పగుచ్చాలతో అంబేద్కర్ కు నివాళి అర్పిస్తూ.. అంబేద్కర్ ఆశయాల సాధన మన లక్ష్యం కావాలని, అంబేద్కర్ కలలు కన్న భరతమాతను మనమంతా కలిసి తయారు చేయాలని, ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ అని తెలిపారు. తన ఆశయ సాధన కోసం లక్ష్యం కోసం ఎలాంటి కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ఆత్మస్వర్యంతో వాటిని ఎదుర్కొని భారతదేశంలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా ఆయన ఎదిగిన తీరు యువతకు స్ఫూర్తిదాయకమని ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు.
కార్యక్రమంలో ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రధాన విభాగాధిపతి డాక్టర్ ఆచార్య శంకర్, మైక్రో బయాలజీ సహచార్యులు ఆచార్య డాక్టర్ వేముల సరోజ, ఆఫీసు సూపరింటెండెంట్ రవికుమార్, సహాయకులు మల్లికార్జున, వైద్య విద్యార్థులు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శానిటేషన్ సిబ్బంది ప్రిన్సిపాల్ ఆచార్య శ్రీదేవితో డాక్టర్ అంబేద్కర్ కేకును కట్ చేయించారు.