Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే మా లక్ష్యం..

శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే మా లక్ష్యమని శాంతిది ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమీషనర్ బండి శేషన్న ఆదేశాల మేరకు వారానికి పట్టణంలో రెండు రోజులు వారానికి ఒకరోజు సాగిన్ జరుగుతున్నదని వారు తెలిపారు. అదేవిధంగా శానిటరీకి సంబంధించినటువంటి అన్ని మందులు లిక్విడ్ పూర్తిగా స్టాక్ ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహం అవసరం లేదని తెలిపారు. ప్రతిరోజు మస్టర్ పనివేళలో పరికరాలతో పాటు మందులను కూడా మేస్త్రీల ద్వారా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా కాలువలు డ్రైనేజీలో వద్ద అపరిశుభ్రంగా ఉంటే మాకు ఫిర్యాదు చేసిన వెంటనే, మా సిబ్బంది ద్వారా సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజలు కూడా ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరాదని, అలా వేస్తే కాలువలు, పెద్ద కాలువలు మురికి నీరు వెళ్లకుండా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందన్నారు. శానిటరీ విభాగంలో ఏ సమస్య అయినా ఎదురైతే స్థానిక సచివాలయంలో కానీ మున్సిపాలిటీలో గాని నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేస్త్రీలు నాగరాజు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img