Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ఖాతాదారులకు మరింత సేవలు అందించడమే మా లక్ష్యం..

బ్యాంక్ ఆఫ్ బరోడా
విశాలాంధ్ర -ధర్మవరం : బ్యాంకు ఖాతాదారులకు మరింత సేవలు అందించి మంచి గుర్తింపు పొందడమే మా లక్ష్యమని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ మేనేజర్ ఈ . బడే సాబ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం బ్యాంకు కార్యాలయంలో సిబ్బందితో 116వ బ్యాంక్ ఆఫ్ బరోడా వార్షికోత్సవ బ్యాంకు వేడుకలు జరుపుకున్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన బడే షాబ్ కావించారు. అనంతరం బడే సాబ్ మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు అందిస్తున్న సేవలను వాటి ప్రగతి వివరాలను తెలియజేశారు. నేడు మా బ్యాంకు ఖాతాదారుల సహాయ సహకారాలతో అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు. అనంతరం మండల పరిధిలోని గొట్లురు అనాధాశ్రమంలో బెడ్ షీట్లు, టవల్స్, నిత్యవసర సరుకులు, పండ్లు, పడుకునే చాపలు, బియ్యం ప్యాకెట్లు, బిస్కెట్లు, బ్రాంచ్ మేనేజర్, సిబ్బంది చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్ ,క్రెడిట్ అధికారులు హెప్సిబా, వెంకటకృష్ణ, నాగేశ్వరయ్య, దినేష్, ప్రతిమ, సుంకమ్మ, అంజలి, వెంకట్ రెడ్డి, హేమచంద్ర, నాగేశ్వరయ్య, గౌతమ్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img