స్పెషల్ ఆఫీసర్ చాంద్ బాషా, ఎంపీడీవో నబి
గిరిజనులు అందరికీ గుణాత్మక విద్యను అందించడం, ఆకలిని తొలగించుట, ఆహార భద్రత, ఆర్థిక భద్రత, పౌష్టిక ఆహారాన్ని పెంపొందించి చేయడమే మా లక్ష్యము అని స్పెషల్ ఆఫీసర్ చాంద్ బాషా ఎంపీడీవో నబి తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రపంచ ఆదివాసి దినోత్సవమును పురస్కరించుకొని, మండల పరిధిలోని రావల చెరువు తండాలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఆదివాసులు సమాజంలో ఆర్థిక అభివృద్ధికి నోచుకోక వారి హక్కులకు సంస్కృతి సాంప్రదాయాలకు భంగం కలుగుతుందని వీరిని సమాజానికి దూరంగా నెట్టి వేయబడుచున్నారని, తమ సర్వేల ద్వారా గ్రహించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారిని అభివృద్ధి బాటలో నడిపేందుకే తాము కృషి చేస్తామని తెలిపారు. గుణాత్మక విద్యను అందిస్తూ నిరంతర అభ్యసనకు తోడ్పాటు ఇవ్వడం, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తూ సంక్షేమాన్ని గిరిజనులు అందరికీ అన్ని వయసుల వారికి అందించడం జరుగుతుందన్నారు. సుస్థిరమైన వినియోగం ఉత్పాదక వ్యవస్థను ఏర్పాటు చేయడం, అందరికీ నీరు, పరిశుభ్రమైన పరిసరాలు ఉండునట్లు చేయడం జరుగుతోందని తెలిపారు. షెడ్యూల్ తెగల వారందరికీ సామాజిక సాధికారత, సమానత్వం, సంక్షేమం, సామాజిక న్యాయం పొందుతూ సంపూర్ణ సమగ్ర ఆరోగ్యంతో సంతోషంగా అన్ని విధాలుగా మానవాభివృద్దితో జీవనం సాగించటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎల్లప్ప, వెల్ఫేర్ సిబ్బంది శ్రీధర్, తండా నాయకులు కేశవ, ప్రజలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.