Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

నాణ్యమైన విద్యుత్తును అందించడమే మా లక్ష్యం

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : నియోజకవర్గంలో నాణ్యమైన విద్యుత్తును అందించడమే మా లక్ష్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం పోతుల నాగేపల్లి జగనన్న కాలనీలో 2.5 కోట్లతో నూతనంగా నిర్మించిన 33/11 కె.వి సబ్స్టేషన్ వారు లాంచనంగా ప్రారంభించారు. అనంతరం విద్యుత్ సబ్స్టేషన్ లోని నూతనంగా అమర్చిన పరికరాలను సప్లై ఛానల్ వారు పరిశీలించి ప్రజలకు అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న కాలనీలో 6,700 కూ పైగా ఇళ్లను నిర్మించడం జరుగుతుందని వీరందరికీ విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేందుకే ఈ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించడం జరిగిందన్నారు. ఈ విద్యుత్ సబ్స్టేషన్ ద్వారా జగనన్న కాలనీయులకే కాకుండా రూరల్ పరిధిలోని పోతుల నాగేపల్లి, తుంపర్తి, మోటమర్ల, సీసీ కొత్తకోట, తదితర ప్రాంతాలలోని రైతాంగానికి నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని తెలిపారు. గతంలో అయితే ఈ ప్రాంతాలకు ఎర్రగుంట విద్యుత్ సబ్స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుండడంతో లోడు ఎక్కువై, నాసిరకంగా విద్యుత్ సరఫరా కావడంతో అటు రైతులు, ఇటు ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ సబ్ స్టేషన్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో ప్రజలు వ్యవసాయం పట్ల మక్కువ చూపుతున్నారని తెలిపారు. అంతేకాకుండా కొత్తగా మరిన్ని విద్యుత్ సబ్స్టేషన్లు గో, బత్తలపల్లి మండలం అప్పరా చెరువులో, ముదిగుబ్బ మండలం దొరిగల్లు ప్రాంతాలలో నూతనంగా నిర్మించేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలను చేపట్టిందన్నారు. తద్వారా రైతులకు లో వోల్టేజి సమస్య పూర్తిగా నివారించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ చైర్పర్సన్ కాచర్ల లక్ష్మి, వైస్ చైర్మన్లు వేముల జయరామిరెడ్డి, శంషాద్ బేగం, విద్యుత్ ఎస్సీఈ. సురేంద్ర, ఈఈ. రమేష్, డి ఈ ఈ. కిరణ్ కుమార్, డి ఈఈ. కన్స్ట్రక్షన్ శ్రీకాంత్ రెడ్డి, రూరల్ ఏఈ జానకి రామయ్య డి వన్ డి2ఏఈలు కొండారెడ్డి, నాగభూషణ, కన్స్ట్రక్షన్ ఏఈ నజీరుద్దీన్ పట్టణ సచివాలయాల కన్వీనర్లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, పోతుల నాగేపల్లి, సిసి కొత్తకోట సర్పంచులు మౌనిక, పల్లి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img