మాజీ ఎమ్మెల్యే సూరి అనుచరులు
విశాలాంధ్ర – ధర్మవరం: మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విడుదల అయ్యేంతవరకు మా పోరాటాలు ఆపమని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (సూరి) అనుచరులు, అభిమానులు అయినా చిగిచెర్ల అరవింద్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, డిష్ రాజు, తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం వారు చంద్రబాబును విడుదల చేయాలంటూ పోస్ట్ కార్డులను రాష్ట్రపతికి స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలోని పోస్ట్ బాక్స్ లో వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్టు చేశారని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అరెస్టు చేయడం, దౌర్జన్యం చేయడం తగదని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆదేశాల మేరకు ఈ పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు విడుదల అయ్యేంతవరకు దశలవారీగా మా పోరాటాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీగా ఉంటూ, ఎటువంటి మచ్చ లేకుండా, పరిపాలన చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షతో అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు చేసినా చంద్రబాబు నాయుడు న్యాయస్థానాలలో గెలిచి కడిగిన ముత్యముల బయటికి వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాప్తాటి రాము, నబి రసూల్, దుస్సా కృష్ణ, కొండ శీన, దస్తగిరి, లక్ష్మీనారాయణ, గంధమనేని నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.