ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్
విశాలాంధ్ర – ధర్మవరం : అధిక జనాభా దేశ ప్రగతికి అవరోధమని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని పలు విషయాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అధిక జనాభా వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితులు దుర్భరంగా ఉంటాయని, అధిక సంతానం వల్ల నష్టాలే తప్ప లాభాలు ఉండవని తెలిపారు. దేశాభివృద్ధికి కుటుంబ నియంత్రణ ఎంతో అవసరమని, ఇద్దరు వద్దు- ఒక్కరే ముద్దు అని తెలిపారు. అధిక జనాభా వల్ల వచ్చే నష్టాలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. చిన్న కుటుంబం- చింతలు లేని కుటుంబం అని, కుటుంబ నియంత్రణ పాటిస్తే ఆరోగ్య కుటుంబం సాధ్యమవుతుందని వారు తెలిపారు. కుటుంబ నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు.