విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ -హెచ్.పీ గ్యాస్.. ఏజెన్సీ దారులు గోవింద చౌదరి మనవరాలు, అనంతశయన, కీర్తి చౌదరి యొక్క కుమార్తె పి. లక్ష్మీ చౌదరి హిందీ పాటను ఆన్లైన్ ద్వారా వినిపించి, అందరిని ముగ్ధుల్ని చేసింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ 9 సంవత్సరాల వయసుగల పి. లక్ష్మీ చౌదరి చిన్న వయసు నుంచే భారతీయ సంస్కృతి, సంగీతము పాటలు అంటే చాలా ఇష్టం అని తెలిపారు. ఇందులో భాగంగానే ఇండియన్ గోల్డెన్ వాయిస్ సీజన్-7 ఆన్లైన్ హిందీ పాటల పోటీలు ఆన్లైన్ ద్వారా మెన్ గ్రో ప్రొడక్షన్ వారు నిర్వహించారు. వయసును బట్టి ఐదు వర్గాలుగా విభజించారని, మొత్తం 1869 మంది ఔత్సాహికులు పాటలో పాల్గొనగా, అందులో జూనియర్స్ విభాగంలో లక్ష్మీ చౌదరికి ద్వితీయ బహుమతి రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయపు సిబ్బంది, కుటుంబ, బంధుమిత్రులు అందరూ కూడా లక్ష్మి చౌదరికి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. మున్ముందు కూడా మరిన్ని విజయాలను సాధించాలని తెలుపుతూ ఆశీస్సులను అందజేశారు.