Sunday, September 24, 2023
Sunday, September 24, 2023

పెయింటర్ దారుణ హత్య

కేసు నమోదు చేసుకున్న టూటౌన్ పోలీసులు
విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గాంధీనగర్ కు చెందిన పెయింటర్ శ్రీనివాసులు అనే వ్యక్తి (23) శనివారం దారుణ హత్యకు గురయ్యారు. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… మృతుడు శ్రీనివాసులు పెయింటర్ పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు. శిరీషను ఆరు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకొని చక్కగా జీవితాన్ని గడిపేవాడు. మద్యం మత్తుకు బానిస అయ్యాడు. శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇతను శనివారం రైల్వే గేట్ ఆవరణంలో శవమై తేలాడు. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. తదుపరి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ సుబ్రహ్మణ్యం సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. భార్య శిరీష ద్వారా వివరాలు సేకరిస్తున్నామని, మృతునికి ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. త్వరలోనే హత్య చేసిన వారిని పట్టుకుంటామని సీఐ తెలిపారు. మృతునికి భార్య సిరీస్ తో పాటు ఒక కుమారుడు రోహిత్ కూడా కలడు. మృతుడు తన స్నేహితులతో తిరిగేవాడని దీంతో గొడవ కూడా పడేవాడని తెలిపారు. ప్రస్తుతం శ్రీనివాసులు ఒంటరిగా ఉంటున్నాడని తెలిపారు. శ్రీనివాసుల్ని చంపుతామని ఓ స్నేహితుడు బెదిరించినట్లు మృతుని కుటుంబ సభ్యులు పోలీసుల విచారణలో తెలిపారు. స్నేహితులే చంపారా? లేదా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో ఇన్చార్జి సిఐ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img