Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక స్త్రీ శక్తి భవనం నందు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ శ్రీ విద్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొదుపు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అన్నారు. మండలంలో వైఎస్సార్ సున్నా వడ్డీ నాల్గవ విడత కింద మొత్తం 734 పొదుపు సంఘాలకు కోటి 22 లక్షల 75 వేల రూపాయలు సీఎం జగన్ పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాకు జమ చేశారన్నారు. ఈ సొమ్ము పేద మహిళలకు ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాల మహిళలు, ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img