Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

ముగిసిన పంచ నాతేశ్వర స్వామి ప్రతిష్టాపన వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కెపిటివీధిలో గల శ్రీ పంచ నాథేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమాలు ఈనెల 30వ తేదీ నుండి నవంబర్ రెండవ తేదీ వరకు నాలుగు రోజులు పాటు అంగరంగ వైభవంగా ఆలయ అభివృద్ధి కమిటీ వారు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా చివరి నాలుగవ రోజు గురువారం శమి నారాయణస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, ఉదయము వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా ప్రాణ ప్రతిష్టను నిర్వహించారు. శేష హోమాలు, కలోన్యాస హోమాలు, పంచామృతాభిషేకం, జ్వాలా, బలి దర్పణ, గోదర్శన, పుష్పాండ చేదన, హారతి, తదితర పూజా కార్యక్రమాలను ప్రధాన అర్చకులు మోహన స్వామి, శిష్య బృందం సుమంత్ కుమార్, లక్ష్మీపతి, రాజేష్ ఆచార్యులు, ఫణి కుమార్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తపాలెం హరి ప్రసాద్, కార్యదర్శి రామ శేషయ్య మాట్లాడుతూ భక్తాదులు, దాతల సహాయ సహకారాలతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నామని, అదేవిధంగా విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమం భక్తాదులు, దాతల నడుమ నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ గుడి అతి పురాతనమైన శివాలయం అని, జీర్ణోద్ధరణ పనులు పూర్తి గావించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img