Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైద్యాధికారి ప్రథమ చికిత్సతో తృటిలో తప్పిన ప్రాణాపాయం

విశాలాంధ్ర – శెట్టూరు : బ్రహ్మ సముద్రం మండలం సంతేకొండాపురం గ్రామానికి చెందిన చన్నమల్లప్ప (50) తన కుమార్తెతో స్వగ్రామం నుంచి కళ్యాణదుర్గం కు తన ద్విచక్రవాహనంపై వెళుతుండగా మంగంపల్లిలోని పాఠశాల దగ్గరకు రాగానే హఠాత్తుగా గుండెపోటు రావడంతో నెమ్మదిగా వాహనం ఆపి అలాగే రోడ్డు మీద కూలబడిపోయాడు.ఈ సంఘటన చూసిన స్థానికులు వెంటనే గ్రామంలో పక్కనే ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ 104 సేవ కార్యక్రమంలో ఉన్న శెట్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వేణు కార్తికేయ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వైద్యాధికారి స్పందించి పరుగుపరుగున తన సిబ్బందితో అక్కడికి చేరుకుని అతడిని ఒక పక్కగా కూర్చోబెట్టి బీపీ , పల్స్ , షుగర్ లెవెల్స్ పరీక్ష చేసి ప్రాణాపాయం నుండి తప్పించి ప్రథమచికిత్స అందజేశారు. అనంతరం అత్యవసర విభాగం 108 కి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పి సకాలంలో అతడిని వాహనంలో ఎక్కించి సమీప కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన వైద్య సిబ్బందికి గ్రామస్తులు అభినందన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఎల్.హెచ్.పీ నమ్రత , ఎఎన్ఎమ్ ఉమ , హెల్త్ అసిస్టెంట్ జాన్ సన్ , 104 సిబ్బంది సునీల్, మల్లికార్జున , ఆశా వర్కర్ యశోద , పాఠశాల ఉపాధ్యాయురాలు శిల్వలత , స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img