Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

తారక రత్న మృతికి నివాళులు

విశాలాంధ్ర – ధర్మవరం:: సినీ నటుడు నందమూరి తారకరత్న మృతి సినీ లోకానికి తీరని లోటు అని తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద తారకరత్న చిత్రపటానికి పూలమాలలు వేసి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంజి, వెంకీ, నవకుమార్, రమేష్, ముత్యాలు ,తుకారాం, వేణు, రామకృష్ణ, రామచంద్ర లు నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తారకరత్న అకాల మృతి ఆ కుటుంబానికి తీర్చలేని లోటు అని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, రెండు నిమిషాలు మౌనవహించి సంతాపాన్ని తెలిపారు. తారకరత్న అతి చిన్న వయసులో అకాల మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని బాధను మిగిల్చిందని తెలిపారు. తారకరత్న సినీ రంగానికి ఎన్నో సేవలు చేశారని, వారి ఆశయ సాధనాల కొరకు నేటి యువతీ యువకులు కృషి చేయాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img