Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రతి ఆసుపత్రిలోనూ పిసిపి అండ్ యాక్ట్ గోడపత్రికలను తప్పనిసరిగా ఉంచాలి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : కమిషనర్ ఆఫ్ హెల్త్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రిలకు సంబంధించిన గైనకాలజిస్టులకు సి- సెక్షన్ ఆడిట్ పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం లో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ కే వీరబ్బాయి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో డాక్టర్ వి సుజాత,,డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ ఆరోగ్యశ్రీ, డాక్టర్ చెన్నకేశవులు డి పి యం ఓ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ పి యుగంధర్ జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి మాట్లాడుతూ.. సిజేరియన్ సెక్షన్ ఆడిట్ కి సంబంధించిన డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు అవలంబించవలసిన విధివిధానాలను సి- సెక్షన్ రేటు ఏ విధంగా తగ్గించాలి,సి- సెక్షన్ జరిగిన తరువాత 48 గంటల్లో ఏవిధంగా ఆడిట్ ప్రొఫార్మాను అంతర్జాలం జాలంలో ఏ విధంగా నమోదు చేయాలి డెలివరీ కేసు షీట్ (ఎల్ 2,ఎల్ 3 ఫారం ) ఏ విధంగా నమోదు చేయాలి, ఆస్పత్రిలో ఉంచవలసిన పోస్టర్లు, పీసీపీ అండ్ టి యాక్ట్ కు సంబంధించిన పోస్టర్లు మరియు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే వీడియోలు అన్నింటినీ పీపీటీ ద్వారా విషదంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కె మారుతి ప్రసాద్ గణాంక అధికారి, భారతి డెమో, త్యాగరాజు డిప్యూటీ డెమో, వేణుగోపాల్ ఐడిఎస్పి,, డాక్టర్ జైతున్ రుమన్,డాక్టర్ శ్రావణ లక్ష్మి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు సి సెక్షన్ ఆడిట్ టీం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img