విశాలాంధ్ర-రాప్తాడు : పీడీలు విద్యార్థులను క్రీడల్లో మెరికల్లా తీర్చిదిద్దాలని ఎంఈఓ సూచించారు. రాప్తాడు జెడ్పీహెచ్ఎస్ లో గురువారం రాప్తాడు నియోజకవర్గ వ్యాయామ ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశం విజయవంతంగా ముగిసింది. ముఖ్యఅతిథిగా జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి సుగుణాబాయి హాజరయ్యారు. ఈ సమావేశంలో హెచ్ఎం బి. నరసింహులు మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయులకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించడం మొట్టమొదటిసారి అయినప్పటికీ ఇది ఎంతో ఉపకరిస్తుందన్నారు. పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు క్రీడలలో నైపుణ్యాలు పెంపొందించాలన్నారు. సుగుణాబాయి మాట్లాడుతూ ప్రభుత్వం పీడీలకు అందించిన ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని తమలో ఉన్న నైపుణ్యాలను మెరుగుపరచుకుని పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు వ్యాయామ విద్య ఉన్నతికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో పిడి రాజశేఖర్ రెడ్డి, ఎన్ కేశవ మూర్తి రిసోర్స్ పర్సన్స్ గా వ్యవహరించారు.