Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

ప్రారంభమైన పెద్దమ్మ తల్లి ఉత్సవ, బోనాల వేడుకలు

విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని ఎర్రగుంటలో గల ఎల్సికేపురంలోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఉత్సవ ,బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు శుక్రవారం అమ్మవారికి పూజారి పెద్దన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగపూజకు చెరువు వద్దకు ఉరుముల వాయిద్యాల నడుమ భక్తాదులతో తరలివెళ్లి, తిరిగి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం పూజారి పెద్దన్న మాట్లాడుతూ ఈ ఉత్సవ బోనాల వేడుకలు ఈనెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఎల్సికేపురం ప్రజలు, పెద్దల సహాయ సహకారములతో భక్తాదుల నడుమ నిర్వహించడం జరుగుతోందన్నారు. 18వ తేదీ సాయంత్రం పెద్దమ్మ తల్లి ఊరేగింపు, 19వ తేదీ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ,పూజలు, 21న సాయంత్రం జ్యోతి బోనాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. 13 సంవత్సరాల తర్వాత అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమాన్ని జరుపుతున్నామని, అమ్మవారి పూజా కార్యక్రమంలో భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తాదులు, పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img