Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

శాకాంబరి అలంకరణలో పెద్దమ్మ తల్లి

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సాలే వీధిలో గల శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం లోని పెద్దమ్మతల్లి శుక్రవారం ఆషాడ మాస సందర్భంగా శాఖబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు వెంకటేష్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం 20 రకాల కాయగూరలు 10 రకాల ఆకుకూరలతో అమ్మవారిని శాకంబరీ అలంకరణలో చేసిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ శాకంబరి అలంకరణకు బుగ్గ వంశస్తులైన బుగ్గ ప్రణీత్ దాతగా వ్యవహరించడంతో అర్చకులు వారి పేరున ప్రత్యేక పూజలను నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలతో రైతులు, ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్న సంకల్పంతోనే అమ్మవారికి శాకంబరీ అలంకరణ నిర్వహించడం జరిగిందని అర్చకులు ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img