Monday, September 25, 2023
Monday, September 25, 2023

వేపాకు అలంకరణతో దర్శనమిచ్చిన పెద్దమ్మతల్లి

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని సాలే వీధిలో వెలసిన శ్రీ పెద్దమ్మతల్లి శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తాదులకు వేపాకు అలంకరణతో దర్శనమిచ్చారు. తొలుత ఆలయ అర్చకులు వెంకటేష్ శర్మ ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకం తో పాటు విశేషాలు నిర్వహించిన తదుపరి, వేపాకుతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ అలంకరణ భక్తాదులను ఎంతగానో ఆకట్టుకుంది. మహిళలందరూ కూడా లలిత సహస్రనామ పారాయనలు చేశారు. ఈ కార్యక్రమం బుగ్గ వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img