Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు

ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

విశాలాంధ్ర – ఉరవకొండ : రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం కులమత రాజకీయాలకి అతీతంగా అర్హులైన వారందరికీ కూడా పింఛన్లు మంజూరు చేసిందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఉరవకొండ మండలానికి మంజూరైన 619 నూతన పింఛన్లను బుధవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయిన ఈ నాలుగేళ్ళలో 28 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల పింఛన్లు ఇస్తున్నాడని వీటి కోసం నెలకు 18 వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు గా తెలిపారు 2014లో 650 వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలు కూడా తుంగలో తొక్కాడని మండిపడ్డారు.రుణమాఫీ చేయకుండా డ్వాక్రా మహిళలను, రైతులను నిలువునా ముంచేసిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు.రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 40 సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పథకాలు అమలు కావడం లేదన్నారు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలంతా అండగా ఉండాలని విశ్వేశ్వరరెడ్డి కోరారు.అనంతరం లబ్ధిదారులతో కలసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలిత, వైస్ ఎంపీపీ నరసింహులు,ఉప సర్పంచ్ వన్నప్ప,పార్టీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు బసవరాజు, ఎంపిడివో అమృత్ రాజ్, ఇంచార్జ్ ఈఓ రమణ,వార్డు సభ్యులు, ఎంపిటిసిలు,వైస్సార్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img