Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

జ్వరాలపై ప్రజలు అవగాహన తప్పనిసరిగా చేసుకోవాలి

మెడికల్ ఆఫీసర్ పుష్పలత
విశాలాంధ్ర – ధర్మవరం : మండల పరిధిలోని పోతుకుంట గ్రామంలో జ్వరాలపై ప్రజలకు అవగాహన ఉండాలని మండల వైద్యాధికారి పుష్పలత తెలిపారు. ఈ సందర్భంగా గురువారం వారు పోతుకుంట గ్రామంలో పర్యటిస్తూ ర్యాలీని నిర్వహించారు. అనంతరం మలేరియా, డెంగ్యూ ,ఇతర రకాలైన జ్వరాలను గూర్చి అవగాహన కల్పించారు. తదుపరి జ్వరంతో బాధపడు వారికి రక్తపూతలు సేకరించడం జరిగిందన్నారు. గ్రామ ప్రజలు నాటువైద్యం, సొంత వైద్యం చేసుకుంటే ప్రాణాలకే ముప్పు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంగజాల నాగవేణి, డిప్యూటీ డిఎంహెచ్వో ఇన్చార్జ్ డాక్టర్ చెన్నారెడ్డి, హెల్త్ సూపర్వైజర్ రాజశేఖర్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ ఆంజనేయులు, ఏఎన్ఎం. శ్యామల, ఎంఎల్ హెచ్ పి. గౌతమి, ఆశా కార్యకర్తలు ఆదినారాయణమ్మ, లక్ష్మీనరసమ్మ, భానుబి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img