Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

పురపాలక ఆదాయానికి, అభివృద్ధికి ప్రజలు సహకరించాలి

మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణ ప్రజలందరూ కూడా పురపాలక ఆదాయానికి, పట్టణ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ,వైయస్సార్ కాలనీ, కేతిరెడ్డి కాలనీ, ఎల్సికేపురం, ఎల్-1, ఎల్-2, ఎల్-3, ఎల్-4 కాలనీలో కమిషనర్ పర్యటించారు. ఇటీవల గుడ్ మార్నింగ్ తో పాటు కౌన్సిల్ సమావేశంలో, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పట్టణంలో కొంతమంది పన్నులు కట్టడం లేదని, ఎవరు కడుతున్నారు? ఎవరు కట్టడం లేదు? ఖాళీ స్థలాలు ఎన్ని? కొళాయిలు ఉన్నవి? లేనివి? ఎన్ని?అన్న విషయాలపై ఆరా తీయాలన్న ఆదేశం ప్రకారం పర్యటించడం జరిగిందని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తూ తదనంతరం వారు మాట్లాడుతూ ఇల్లు పట్టా పొంది, ఇల్లు కట్టుకొని, పన్నులు సకాలంలో కూడా చెల్లించాలని, ఇంకను పన్ను చెల్లించలేని వారందరూ కూడా చెల్లించాలని తెలిపారు. అంతేకాకుండా పన్నులు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఒక ప్రత్యేక టీమును ఈనెల ఏడవ తేదీ వరకు పంపడం జరిగిందని, సమాచారాన్ని అందుకొని, ప్రజలకు సకల సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. ప్రజలు పన్నులు కట్టకపోతే ఆదాయం, పట్టణ అభివృద్ధి కుంటుపడుతుందని, పురపాలక సంఘానికి వచ్చే ప్రతి పైసా.. ప్రజల కొరకు, పట్టణము కొరకు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కొళాయి గుత్తలు, కొళాయి లేనివారు, కొళాయి ఉండి పన్ను కట్టని వారు కూడా గుర్తించి, తప్పనిసరిగా అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. పట్టణ ప్రజల సమస్యల విషయమై తాము ఎప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఆనందు సచివాలయాల అడ్మిన్ కార్యదర్శులు, ప్లానింగ్ కార్యదర్శులు, వీఆర్వోలు, అమినిటిష్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img