మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్
విశాలాంధ్ర-గుంతకల్లు : కలుషితమైన నీటి నీటిని తాగుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ శాసన సభ్యులు జితేంద్ర గౌడ్ అన్నారు సోమవారం టిడిపి ఆధ్వర్యంలో గుంతకల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను సందర్శించి విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఆర్ జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ…పట్టణ ప్రజలు మున్సిపాలిటీ త్రాగునీటి కష్టాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజా ప్రతినిధులు, కమిషనర్, మున్సిపల్ సిబ్బంది, ముందస్తుగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో నీటిని నింపకుండా నీళ్లు అడుగంటు పోయేవరకు ఉంటు ఎంత అజాగ్రత్త తో వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందన్నారు.ఇక్కడ కౌన్సిలర్లు తమ వార్డులో 8 రోజులకు ఒక్క సారి మట్టితో కూడిన కలుషిత మంచినీటి సరఫరా చేసున్నారు, ఆ నీటిని తాగి ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని వాపోయారు.హంద్రీనీవా, తుంగభద్ర ద్వారా నీటిని వదలడం లేదు ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఇంటింటికి బిస్లరీ, ఫిల్టర్ వాటర్ సరఫరా చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు, కమిషనర్,చైర్ పర్సన్ పరిష్కరించకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.గత టిడిపి హయాంలో ప్రతిరోజు నీళ్లు సరఫరా చేస్తుంటే ప్రజలు రోజు వదలడం వల్ల నీళ్లు వృధా అవుతాయని రోజు మార్చి రోజు వదలాలని ప్రజలు చెప్పేవారని అన్నారు.ఎమ్మెల్యే జెపిసి ద్వారా అనుమతులు కోరాలని పేపర్లు చూపించడం కాదు. త్వరగతిన జేపీసీ ద్వారా తుంగభద్ర, హంద్రీనీవా ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో నీటిని నింపి శుద్ధ జలాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి కౌన్సిలర్లు పవన్ కుమార్ గౌడ్ ,అనురాధ,కృపాకర్ గుడ్ ఫిట్టింగ్ అంజి అరుణ టిడిపి నాయకులు కేశప్ప తలారి మసనప్ప ,కిృష్ణారెడ్డి,నందీశ్వర్,ముక్కన్న రామంజి,తదితరులు పాల్గొన్నారు…