Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం అధికంగా ఉండాలి..

డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్
విశాలాంధ్ర -ధర్మవరం: పర్యావరణ పరిరక్షణలో ప్రజల యొక్క భాగస్వామ్యం అధికంగా ఉండాలని డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్రపంచ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా డిపో ఆవరణములో అధికారులు సిబ్బంది మొక్కలను నాటడం జరిగింది. అనంతరం మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ నేడు పర్యావరణాన్ని రక్షించకపోతే భావితరాలకు నష్టమే కలుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని కూడా అరికట్టాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని తెలిపారు. విపత్తులను నివారించి ప్రకృతిని పరిరక్షించడం అందరూ అలవర్చుకోవాలని తెలిపారు. అదేవిధంగా భూతాప ఉన్నతికి, భూసార క్షీణతకు, వాయు, జల కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించి, ప్లాస్టిక్ రహిత పట్టణంగా రూపొందించాలని వారు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు సముద్రంలో కలుస్తున్నాయని, ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. కావున ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలందరూ నిషేధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది వెంకటేశులు, శ్రీరాములు, ప్రేమ్ కుమార్, ఓబులేసు, సెక్యూరిటీ గార్డు రామాంజనేయులు, ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నాగార్జున రెడ్డి, నాయకులు నరసింహులు, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img