Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం

విశాలాంధ్ర – ఉరవకొండ : వ్యక్తిగత పరిశుభ్రత వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని ఉరవకొండ ఆయుర్వేద వైద్యాధికారి ఎస్ఎండి షఫీ అన్నారు.శుక్రవారం ఉరవకొండ లో అంబేద్కర్ గురుకుల బాలికల విద్యార్థినీలకు ఆయుర్వేద వైద్య విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థినీలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు యోగాసనాలు,ప్రాణాయామం,ధ్యానము చేయుట ద్వారా మానసిక దృఢత్వం,జ్ఞాపకశక్తి,ఏకాగ్రత పెరిగి చదువుకొనుటకు ఎక్కువగా అవకాశం ఉంటుందన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయుట ద్వారా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండవచ్చన్నారు.వాతావరణం కాలుష్యం కాకుండా ప్రతి ఒక్కరూ పచ్చని చెట్లు పెంచాలని సూచించారు సంపూర్ణ ఆరోగ్యం ఉండాలంటే ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు, పాలు గుడ్లు వంటి పౌష్టిక ఆహార పదార్థాలు భుజించాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ భారతి,స్టాఫ్ నర్స్ సంధ్య,ఉపాధ్యాయ సిబ్బంది,విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img