సర్వీస్ రూల్స్ ప్రకారం పరిష్కారం చూపాలని ఎస్పీ ఆదేశాలు జారీ
విశాలాంధ్ర -అనంతపురం : జిల్లా ఎస్ప పి.జగదీష్ జిల్లాలోని పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. బదిలీలు, సస్పెన్సన్ రీఓక్ మరియు ఇతర సమస్యలపై సిబ్బంది పిటీషన్లు అందజేశారు. సర్వీస్ రూల్స్ ప్రకారం పరిష్కారం చూపాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ డి.వి.రమణమూర్తి, జిల్లా పోలీసు కార్యాలయం ఏ.ఓ శంకర్, బి.సూపరింటెండెంట్ ప్రసాద్, ఎస్పీ సిసి ఆంజనేయ ప్రసాద్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులనాయుడు, లక్ష్మినారాయణ, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.