Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

పోలా రామాంజనేయులు జీవితమంతా ప్రజల పోరాటాలకు సల్పిన మహనీయుడు…

పట్టు చీరల తయారీ వ్యాపారస్తుల అధ్యక్షులు గిర్రాజు రవి
విశాలాంధ్ర ధర్మవరం: సిపిఎం నాయకుడు పోలా రామాంజనేయులు తన జీవితమంతా ప్రజల పోరాటాల సమస్యలపై పోరాడిన, ఒక యోధుడు అని పట్టు చీరల తయారీ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం పోలా రామాంజనేయులు మృతి పట్ల సంతాపం తెలుపుతూ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కీర్తిశేషులు పోలా రామాంజనేయులు తో పాటు తాను కూడా 18 సంవత్సరాలుగా చేనేత ఉద్యమంలో పాల్గొని జైలు కూడా వెళ్లడం జరిగిందన్నారు. చేనేత పరిశ్రమన్న చేనేత కార్మికులన్న పోలా రామాంజనేయులు కు అమితమైన ప్రేమ అని తెలిపారు. నిరంతరం అలుపెరుగని ఒక యోధుడు అని వయస్సు కూడా లెక్కచేయకుండా ఎన్నో పోరాటాలు చేసి విజయ పదం లో నడిచిన వ్యక్తి అని తెలిపారు. ఇటువంటి వ్యక్తిని కోల్పోవడం తీరని లోటు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టు చీరల వ్యాపారస్తులు యుగంధర్, పోలా వెంకటనారాయణ, అమీర్ భాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img